ఓవైపు కోవిడ్ ఉధృతితోనే అల్లాడిపోతున్న భారత్ ను బ్లాక్ ఫంగస్ మరోవైపు నుంచి బ్లాక్ ఫంగస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చింది ఏపీ ప్రభుత్వం. ఈమేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే.
మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ‘బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కూడా ఆదేశించారు. వైద్యం, సౌకర్యాలపరంగా అన్నివిధాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం’ అన్నారు.