ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సంక్రాంతి వరకు ఆశ పెట్టుకోవద్దంటున్న అల్లు అరవింద్‌

ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌ పూర్తి అయిన వెంటనే థియేటర్లు ఓపెన్‌ అవ్వవని అందరికి తెలుసు. అయితే నెల రెండు నెలల తర్వాత అయినా థియేటర్లు ఓపెన్‌ అయితే తమ సినిమాలను విడుదల చేసుకోవాలని చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యేప్పటికి మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతాయి. దాంతో ఈ రెండు మూడు నెలల గ్యాప్‌ కూడా అప్పుడు ఫిల్‌ చేసేలా వరుసగా సినిమాలు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.

ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పీరియడ్‌ పూర్తి అయిన తర్వాత కూడా రెండు నెలల వరకు థియేటర్లు మూసి ఉంచడం బెటర్‌ అన్నట్లుగా సలహా ఇచ్చాడు. థియేటర్లు ఓపెన్‌ చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం వారు అనుమతించే అవకాశం లేదు. లాక్‌ డౌన్‌ తర్వాత కూడా కొన్నింటిపై ఆంక్షలు ఉంటాయి. ఆ కొన్నింటిలో ఖచ్చితంగా స్కూల్స్‌, థియేటర్లు మరియు వేడుకలు అంటూ ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.

ఆ ఆంక్షలు మూడు నాలుగు నెలల వరకు ఉంటుందని అనుకున్నారు. కాని అల్లు అరవింద్‌ మాత్రం వచ్చే జనవరి వరకు కూడా యధాస్థితికి ఈ పరిస్థితి వచ్చేలా లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. పెద్ద సినిమాలు ఈ ఏడాదిలో వస్తాయనే ఆశ పెట్టుకోక పోవడం మంచిది అనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా వచ్చే ఏడాది వరకు లేదంటే ఈ వేసవి కాకుంటే వచ్చే వేసవి వరకు సినిమాల విడుదల ఆగాల్సి రావచ్చు అంటున్నాడు. అల్లు అరవింద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం థియేటర్ల యాజమాన్యాలనే కాకుండా సినీ కార్మికులకు కూడా ఆందోళన కలిగేలా చేస్తున్నాయి.

Exit mobile version