రచయితగా పలు సూపర్ హిట్స్‌ను దక్కించుకున్న వంశీ ఖచ్చితంగా తనకు మంచి సక్సెస్ ఇస్తాడనే నమ్మకంతో వంశీకి దర్శకుడిగా బన్నీ ప్రమోషన్ ఇచ్చాడు. కాని బన్నీ నమ్మకంను వంశీ నిలుపుకోలేదు. అల్లు అర్జున్ను కొత్తగా చూపించాలని ప్రయత్నించిన వంశీ విఫలం అయ్యాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ వంశీ రెండవ సినిమా ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూనే ఉన్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన ఫ్లాప్ ను రెండవ సినిమాతో అంతా మర్చి పోయేలా చేయాలని వంశీ పట్టుదలతో ఉన్నాడు.
ఆ పట్టుదలతోనే పలు స్క్రిప్ట్‌లు రాసిన వంశీ తాజాగా ఒక స్క్రిప్ట్‌తో మళ్లీ బన్నీని మెప్పించాడట. ఈసారి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఒక రేసుగుర్రం, కిక్ తరహాలో కథను వంశీ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత చేద్దామంటూ హామీ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. నా పేరు సూర్య చిత్రంతో నిరాశపర్చినా కూడా వంశీకి మళ్లీ ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక వేళ ఇది నిజమే అయితే నిజంగా బన్నీ ఘట్స్కు మెచ్చుకోవాల్సిందే.