ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అల్లు అర్జున్ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టిన కొరటాల శివ

దర్శకుడు కొరటాల శివ వరసగా నాలుగు విజయాలతో దర్శకుడిగా టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. ఈ నాలుగు చిత్రాల్లో కూడా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో కొరటాలకు దర్శకుడిగా బాగా పేరొచ్చింది. ఇదే ఊపులో మెగాస్టార్ చిరంజీవితో తన ఐదవ చిత్రాన్ని చేయడానికి సంకల్పించాడు. అయితే చిరంజీవి కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశాడు కొరటాల. తీరా షూటింగ్ మొదలై అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో ఇలా కరోనా కారణంగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఏదేమైనా ఆచార్యను వచ్చే సమ్మర్ కు విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు ఈ దర్శకుడు.

ఇక తన కెరీర్ లో ఇలా ఎక్కువ గ్యాప్ లు లేకుండా చూసుకోవడానికి ఆచార్య విడుదలైన వెంటనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతమున్న హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే వచ్చే ఏడాదికి ఫ్రీ అవుతాడు కాబట్టి తన కోసం తన దగ్గరున్నకథలలో ఒకదాన్ని ఎంపిక చేసుకుని దాన్ని మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ వంటి దర్శకుడు వచ్చి కథ చెబుతానంటే బన్నీ మాత్రం ఎందుకు కాదంటాడు.

Exit mobile version