ఇంచుమించు అంతే వైబ్రేంట్ పర్సనాలిటీ టాలీవుడ్ లో మనకు ఎవరున్నారు? అన్నది పరిశీలిస్తే ఇక్కడ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్ని) వైఫ్ స్నేహా రెడ్డి అందం గురించి వ్యక్తిత్వంలో హుందాతనం గురించి చెప్పాల్సిన పనే లేదు. అప్పుడప్పుడు ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుసరిస్తూ స్నేహా ఇచ్చే షాక్ ల గురించి తెలిసిందే.
తాజాగా స్నేహారెడ్డి బ్లాక్ కలర్ శారీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలోని అగ్రశ్రేణి ఫ్యాషన్ ఐకాన్ కూడా ఆమె అద్భుతమైన రూపాన్ని చూసి మురిసిపోయింది మరియు స్నేహ లుక్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్య ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
మనీష్ మల్హోత్రా చీర- మ్యాచింగ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కళ్ళన్నీ తన వైపుకు తిప్పుకునేంత అందంగా కనిపిస్తోంది. ఫ్యాషనిస్టా సమంతా రూత్ ప్రభు దృష్టిని కూడా తన రూపం ఆకర్షించింది. స్నేహ ఆకర్షణీయమైన లుక్ పై `హాట్` అంటూ వ్యాఖ్యను పోస్ట్ చేసింది. టాలీవుడ్ లోని ఏ స్టార్ హీరోయిన్ కంటే స్నేహా తక్కువేమీ కాదని సమంతా వ్యాఖ్యకు చాలామంది అంగీకరించాల్సిందే. మీరా రాజ్ పుత్ తర్వాత మళ్లీ స్టార్ వైఫ్స్ లో అంత అందంగా ఆకర్షణను కలిగి ఉన్న భార్యామణిగా స్నేహా పేరు మార్మోగుతోంది.