Advertisement

అమితాబ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్!

Posted : March 1, 2021 at 7:08 pm IST by ManaTeluguMovies

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. అమితాబ్ స్వయంగా తాను హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నట్లుగా అప్డేట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు అందరూ కంగారుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తున్నారు. అమితాబ్ తన బ్లాగ్ లో హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు. దీని వల్ల కొన్ని రోజులు బ్లాగ్ కు దూరమవుతున్నట్లుగా ప్రకటించారు.

అభిమానుల్లో ఆందోళన ఎక్కువవడంతో అమితాబ్ కుటుంబ సభ్యులు అప్డేట్ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, అమితాబ్ కోలుకుంటున్నారని… త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అమితాబ్ కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. రీసెంట్ గా అమితాబ్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దాన్నుండి కోలుకున్న అమితాబ్ మళ్ళీ షూటింగ్ లకు హాజరవుతున్నారు.


Advertisement

Recent Random Post:

కంగనాపై సుప్రియా శ్రీనేత్ అభ్యంతరకర పోస్ట్

Posted : March 27, 2024 at 12:11 pm IST by ManaTeluguMovies

కంగనాపై సుప్రియా శ్రీనేత్ అభ్యంతరకర పోస్ట్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement