అభిమానుల్లో ఆందోళన ఎక్కువవడంతో అమితాబ్ కుటుంబ సభ్యులు అప్డేట్ ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, అమితాబ్ కోలుకుంటున్నారని… త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అమితాబ్ కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. రీసెంట్ గా అమితాబ్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దాన్నుండి కోలుకున్న అమితాబ్ మళ్ళీ షూటింగ్ లకు హాజరవుతున్నారు.