ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. రవితేజ ఖిలాడీ, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోంది. అలాగే సునీల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో అనసూయ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఇక అనసూయ ఆస్తుల చిట్టా గురించి తెలిస్తే షాకవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సుమ తర్వాత అనసూయనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోన్న యాంకర్. ఆమెకు హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు, దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే రెండు కార్లు, ఇంకా మరిన్ని ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రతీ ఏటా ఆమె 2 నుండి 3 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తోందిట.