ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అనసూయ పోస్ట్ చేసిన ఫోటో కారణంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్న నెటిజెన్

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ క్రమంగా ఇప్పుడు సినిమాల్లో భారీ అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం కేరళలో ఉంది అనసూయ. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న భీష్మ పర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగులో రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో నటిస్తోంది.

సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది అనసూయ. ఈరోజు లైట్ పింక్ కలర్ శారీలో తన పిక్స్ ను పోస్ట్ చేసింది.

శారీలో కూడా హొయలు ఎలా ఒలికించాలో అనసూయకు బాగా తెలుసు. ఇదిలా ఉంటే ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. శారీ మీకు బాగా సూట్ అయింది. ఇక నుండి శారీలోనే జబర్దస్త్ కు రండి అని ఒకరంటే, మరీ ఇంత అందంగా ఉన్నారు, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చా? ఒక కొంటె నెటిజెన్ స్పందించాడు.

Exit mobile version