తాజా స్కిట్ లో ఈ మధ్య పైన పటారం, లోన లొటారం అంటూ పాట చేసావు కదా అది నా గురించేనా అన్నాడు హైపర్ ఆది. దానికి అనసూయ అయ్యో రామా, మిమ్మల్ని అంత మాట అంటానా అంటుంది, ఇంతకీ నన్ను చూస్తే ఏమనిపిస్తోంది అని అనసూయను అడిగితే మీరు ఎప్పటికీ ముసలోడు కాకూడదు అని అంటుంది అనసూయ.
ఈ డైలాగ్ పై అనసూయకు పంచ్ వేసాడు ఆది. నువ్వు ముసలిదానివి అయిపోవచ్చు కానీ నేను అవ్వకూడదా అని అంటాడు. వెంటనే షాక్ తిన్న అనసూయ ఆదిని కొట్టడానికి వస్తే తను పారిపోతాడు. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వేశారు.