జాతీయ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నుండి ఈమెకు ఆహ్వానం అందిందట. కీలక పార్టీ పదవితో పాటు రాబోయే రోజుల్లో మంచి సీటు కూడా ఇస్తామంటూ అధికార పార్టీ వారు హామీ ఇచ్చి మరీ పిలిచారట. రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న అనసూయ సన్నిహితుల సలహా మేరకు ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట. కెరీర్ మరో అయిదు సంవత్సరాల పాటు ఇలాగే పీక్స్ లో దూసుకు పోయే అవకాశం ఉంది.
కెరీర్ పరంగా డల్ అయినప్పుడు రాజకీయాల గురించి ఆలోచించడం బెటర్ అంటూ ఈ అమ్మడికి శ్రేయోభిలాషులు సూచించారట. అందుకే ఈమె రాజకీయాలకు సున్నితంగా నో చెప్పింది. తప్పకుండా భవిష్యత్తులో చూద్దాం అంటూ కూడా ఈమె వారికి సమాధానం ఇచ్చిందట. రాబోయే రోజుల్లో అనసూయను రాజకీయ రంగస్థలంపై చూడటం ఖాయం అన్నమాట. ఎంతో మంది బుల్లి తెర మరియు వెండి తెర స్టార్స్ రాజకీయాలు చేసి సక్సెస్ అయ్యారు. అనసూయ కూడా అదే దారిలో నడుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.