ఏనుగు మృతికి కారకులు అయిన వారిని తీవ్రంగా శిక్షించాలంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగు అడవి నుండి జనావాసాల్లోకి వచ్చినా కూడా గుర్తించని అధికారులను కూడా శిక్షించాలంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అనసూయ ఈ విషయంలో స్పందిస్తూ… ఇప్పటికే మనం మరణంకు దగ్గర్లో ఉన్నాం. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ జీవితాన్నే చెత్తగా చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మనుషులు కొందరు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం దారుణం.
అడవి, అడవిలో ఉండే జంతువులు దైవత్యవంతో సమానం. అలాంటి దైవాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని ఏం చేసినా తప్పు లేదు. ఈ సంఘటన తెలిసినప్పటి నుండి చాలా వేదనకు గురి అయ్యాను. ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. నా మనసు తీవ్ర అల్ల కల్లోలంకు గురయ్యిందని అనసూయ పేర్కొంది.