ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తమిళ ప్రేక్షకుల ముందుకు రంగమ్మత్త


జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ నటిగా కూడా బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె కృష్ణ వంశీ రంగమార్తండ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమెను పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ సంప్రదించాడనే వార్తలు వచ్చాయి. కాని ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈమె తమిళ ప్రేక్షకుల ముందుకు కూడా వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తమిళంలో ఈమె ఒక సినిమా చేస్తున్నట్లుగా చెప్పడంతో పాటు ఆ సినిమాలోని తన లుక్ ను కూడా రివీల్ చేసింది. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సిల్క్ స్మిత పాత్ర తరహాలో ఈమె నటించబోతున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిల్క్ పాత్రలో అనసూయ నటించడం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్ అనడంలో సందేహం లేదు. అలాంటి పాత్రను అనసూయ ఎలా చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

తమిళంలో మొదటి సినిమాతోనే ఒక ఛాలెంజింగ్ రోల్ ను చేయడం ద్వారా ఈమె మరింతగా తమిళ ఆడియన్స్ కు చేరు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తమిళ ఆడియన్స్ ను మెప్పించగలిగితే ఈమెకు అక్కడ హీరోయిన్ గా ఆఫర్లు కూడా వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Exit mobile version