లక్కీగా ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికింది. ఫిబ్రవరి 5న జాంబీ రెడ్డి వచ్చేవరకూ ఈ సినిమాకు పెద్ద పోటీ లేదు. మాస్టర్ వంటి సినిమాలు కూడా ఓటిటిలో వచ్చేస్తుండడంతో ప్రదీప్ సినిమాకు మంచి అవకాశం. ఈ సినిమా దాదాపుగా నాలుగున్నర కోట్ల బిజినెస్ చేసింది. అన్ని లెక్కలు కలుపుకుంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా హిట్ అనిపించుకోవాలంటే 5 కోట్లకు పైన వసూలు చేయాల్సి ఉంది.
ఒక కొత్త హీరోకు ఇది కష్టమైన విషయమే. అయితే ప్రదీప్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న గుడ్ ఇమేజ్, నీలి నీలి ఆకాశం సూపర్ హిట్ సాంగ్ టికెట్లు తెగే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.