Advertisement

అలాంటి సినిమా చేసి తప్పు చేశానంటున్న హాట్ యాంకర్

Posted : May 8, 2020 at 3:54 pm IST by ManaTeluguMovies

రష్మీ గౌతమ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అన్న విషయం తెల్సిందే. జబర్దస్త్ ద్వారా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ ఇప్పుడు టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. అయితే జబర్దస్త్ చేయకముందు కూడా రష్మీ గౌతమ్ అటు సినిమాలు, ఇటు షోలు చేసేది.

అయితే జబర్దస్త్ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అందులో ఆమె పండించే గ్లామరసానికి యువత ఫిదా అయ్యారు. ఆమె ఇమేజ్ కారణంగానే గుంటూరు టాకీస్ లో ఒక బోల్డ్ రోల్ ఆఫర్ చేసాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రష్మీ గౌతమ్ ఈ సినిమాలో హాట్ షో చేసిందనే చెప్పాలి. ఆమె రోల్ సినిమా రిలీజ్ టైమ్ లో హాట్ టాపిక్ అయింది కూడా. అప్పట్లో ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పిన రష్మీ ఇప్పుడు మాత్రం ఫీలవుతోంది.

చూస్తుంటే ఇన్నేళ్ల తర్వాత గుంటూరు టాకీస్ చేసి తప్పు చేసానేమోననిపిస్తోంది. ఎందుకంటే దాంతో నాకు ఒకలాంటి ఇమేజ్ వచ్చింది. దానికి భిన్నమైన పాత్రలను ఊహించాను నేను. కానీ ఒకలాంటి పాత్రలే నా వద్దకు వచ్చాయి. అందులో కొన్ని చేశాను. అవి అదే తరహాలో ఉండడంతో ప్లాపయ్యాయి. గుంటూరు టాకీస్ హిట్ అయినా కూడా నాకు ఇమేజ్ పరంగా ఇబ్బంది పెట్టింది. అందుకే ఆ సినిమా చేసి తప్పు చేసానేమోననిపిస్తోంది అని చెప్పుకొచ్చింది.

సినిమాల్లో అన్ని రకాల పాత్రలూ చేయాలననుందని తెలిపింది రష్మీ.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan Health Condition | Pawan Kalyan ఆరోగ్యంపై Janasena కీలక ప్రకటన | AP Elections 2024

Posted : April 21, 2024 at 7:01 pm IST by ManaTeluguMovies

Pawan Kalyan Health Condition | Pawan Kalyan ఆరోగ్యంపై Janasena కీలక ప్రకటన | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement