తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ.. “నేను బిగ్‌బాస్ ప్రోమోలు చూస్తున్నాను. గేమ్‌లో పరిస్థితిని అంచనా వేసి అప్పటికప్పుడు అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ చేయడం ప్రశంసనీయం. పైగా అందరూ అతడిపై అరుస్తున్నా సహనంగా ఉన్నాడు. అది చూసి నేనేమీ షాక్ అవలేదు. ఎందుకంటే అతడిలో నాకు ఎమ్ ఎస్ ధోనీ కనిపిస్తున్నాడు. అభి.. ఏదైనా గొడవ జరిగితే తిరిగి అరవడం బదులు కూర్చుని మాట్లాడుకుందాం అనే టైపు. అతడు రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటాడు. చాలా సైలెంట్. అవసరమైతేనే మాట్లాడతాడు. ఓ ఫంక్షన్‌లో మేము మాస్ డ్యాన్స్ చేస్తున్నాం. అక్కడే ఉన్న అభిని డ్యాన్స్ చేయమని పిలిచాం. కానీ అతను సాల్సా వంటి పాటలకైతేనే స్టెప్పులేస్తానన్నాడు. కానీ అభి ఒక్కసారి నమ్మాడంటే అది ఏదైనా సరే విడిచిపెట్టడు. అతడు తప్పకుండా టాప్ 3లో ఉంటాడు. కానీ రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే మొదట నేనే అతడిని విమర్శిస్తా” అని చెప్పుకొచ్చాడు.