‘మా అమ్మకు 40 ఏళ్ల వయసులో నేను పుట్టాను. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. నర్స్ గా పనిచేసి అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుండి ఎప్పుడూ బంధువులు మాకు సాయంగా రాలేదు. అందుకే మేము వారికి దూరంగా ఉంటున్నాము. అమ్మ నా చిన్నతనంలో సైకిల్ మీదే ఎంత దూరమైనా ట్రావెల్ చేసేది. ఓసారి నేను అమ్మతో కలిసి వెళ్ళాను. తిరిగివస్తుండగా రాత్రి అయింది. కొందరు ఆకతాయిలు మమ్మల్ని వెంబడించడం మొదలుపెట్టారు’.
‘అమ్మ వారి దగ్గరకి వెళ్లి నాకు 44 ఏళ్ళు ఉంటాయి. మీ అమ్మ వయసు ఉంటుంది. ఇలా చేయడం ఏమైనా బాగుందా అని అడిగింది. దాంతో వారు రియలైజ్ అయ్యారు. మీకేమైనా సహాయం కావాలంటే చెప్పండి అని అన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల.