ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘నాకు లవర్‌ లేడండీ బాబోయ్‌’ అంటున్న హాట్ యాంకర్

బుల్లి తెర స్టార్‌ శ్రీముఖి నెట్టింట కూడా తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికలపై ఆమెకు ఏకంగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ రేంజ్‌ లో క్రేజ్ ఉన్న ఈ అమ్మడు ఇటీవల నెట్టింట అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈమె ప్రేమ మరియు పెళ్లి విషయాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

మీరు ఎవరితో అయినా రిలేషన్‌ లో ఉన్నారా అనే ప్రశ్నకు నాకు లవర్ లేరండీ బాబు, నన్ను నమ్మండి అంటూ సమాధానం ఇచ్చింది. అక్కా బావ ఎప్పుడు వస్తాడు అంటూ మరొకరు ప్రశ్నించగా నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. మీరు నన్ను ప్రేమిస్తారా అంటూ ఒకరు ప్రశ్నిస్తే నేను నా అభిమానులందరిని కూడా ప్రేమిస్తున్నాను అంది. మీ తమ్ముడిని నేను ప్రేమిస్తున్నాను అంటూ ఒకరు చెప్పగా అరేయ్ తమ్ముడా నీతో యూట్యూబ్‌ వీడియోలు చేయాలంటే నాకేంతో భయంగా ఉంది. వీడియో కింద నీ గురించే ఎక్కువ కామెంట్స్ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

Exit mobile version