ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

లోపల ఉందా.. సుమ డబుల్‌ మీనింగ్‌ లతో రెచ్చి పోతోంది

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్‌ అనే పదం వినిపిస్తే చాలు సుమ గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె చేసే ప్రతి షో కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. తెలుగు యాంకర్స్ లో ఆమెను మించిన వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమయస్ఫూర్తితో ఆమె చేసే యాంకరింగ్‌ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎదుటి వారిపై అప్పటికప్పుడు పంచ్‌ లు వేయగల సత్తా ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సుమ అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో సుమ డబుల్‌ మీనింగ్ డైలాగ్‌ లు కొడుతూ మరింతగా ప్రేక్షకులకు చేరువ అవుతోంది.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్‌ షో కు ఢీ షో డాన్సర్స్ మరియు వారి మాస్టర్స్ గెస్ట్‌ లు గా వచ్చారు. వారికి సంబంధించిన ఎపిసోడ్ వచ్చే వారం టెలికాస్ట్‌ కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ప్రోమో లో సుమ వారితో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తం ఎనిమిది మందిని కూడా తన మాటల గారడితో అవతలి వారిని మాట్లాడనివ్వకుండా చేసింది. ఒక డాన్సర్‌ ఒక స్టెప్‌ వేస్తున్న సమయంలో ఆయన్ను లోపల ఉందా అంటూ హెచ్చరించింది. ఆమె డబుల్‌ మీనింగ్ డైలాగ్‌ కు అక్కడ ఉన్న వారందరు తెగ నవ్వేశారు.

Exit mobile version