Advertisement

మరో బాలీవుడ్ స్టార్ ను దిగుమతి చేయబోతున్న త్రివిక్రమ్

Posted : April 18, 2022 at 8:02 pm IST by ManaTeluguMovies

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా తో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈయన మహేష్ బాబుతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

వీరిద్దరి కాంబోలో అతడు.. ఖలేజా సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయితే బుల్లి తెరపై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈసారి మహేష్ బాబ కు త్రివిక్రమ్ సక్సెస్ లను ఇవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు నమ్మకంతో ఉన్నారు.

మహేష్ బాబు సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అయిన అనీల్ కపూర్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ కి సౌత్ సినిమాలంటే చిన్న చూపు ఉండేది. కాని ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను మన సినిమాలు మించుతున్న నేపథ్యంలో హిందీ స్టార్స్ ఇక్కడ నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

భారీ చిత్రాలతో సౌత్ సినిమాలు నార్త్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. సల్మాన్ ఖాన్ నుండి మొదలుకుని ఇంకా చాలా మంది స్టార్స్ ను రాబోయే రోజుల్లో మనం తెలుగు సినిమా స్క్రీన్ పై చూడబోతున్నాం.

అందులో భాగంగానే అనీల్ కపూర్ ను కూడా తెలుగు సినిమాలో చూడబోతున్నామని అభిమానులు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ గతంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ తో వర్క్ చేశాడు. ఇప్పుడు అనీల్ కపూర్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ వార్తలు నిజం అయితే ఖచ్చితంగా త్రివిక్రమ్ అరుదైన ఘనత ను దక్కించుకున్న దర్శకుడిగా నిలుస్తాడు. ముందు ముందు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ రంగంలోకి దిగబోతున్నారు. వారికి అనీల్ కపూర్ మార్గ దర్శకుడిగా నిలుస్తాడనే నమ్మకం కూడా కనిపిస్తుంది. హీరోగా అనీల్ కపూర్ నటించిన చాలా సినిమాలు సౌత్ ప్రేక్షకులకు సుపరిచితం. అందుకే మహేష్ బాబు సినిమాలో ఆయన నటించడం వల్ల ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.


Advertisement

Recent Random Post:

ಯುವ ವಿಜಯ | Singer Vijay Prakash Interview with Yuva Rajkumar & Santhosh Ananddram | Yuva on March 29

Posted : March 27, 2024 at 7:21 pm IST by ManaTeluguMovies

ಯುವ ವಿಜಯ | Singer Vijay Prakash Interview with Yuva Rajkumar & Santhosh Ananddram | Yuva on March 29

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement