Advertisement

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

Posted : May 25, 2020 at 1:07 pm IST by ManaTeluguMovies

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన లాస్ట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు అయితే రికార్డులను తిరగరాసింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఆరవ సినిమా, తనకు డబుల్ హ్యాట్రిక్ అందించగల సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 2 కు సీక్వెల్ ఎఫ్ 3 చేస్తానని ఇంతకు ముందే ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఈ లాక్ డౌన్ కారణంగా తన స్వస్థలంలోనే ఉండిపోయిన అనిల్, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎఫ్ 3 స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు షూటింగ్ ను మొదలుపెట్టడానికి అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు.

అయితే ఈ మధ్యన మరో రూమర్ పుట్టుకొచ్చింది. ఎఫ్ 3 కంటే ముందు అనిల్, నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేయబోతున్నాడని అన్నారు. గతంలోనే బాలయ్యతో రామారావు గారు అనే సినిమాను ప్రయత్నించిన అనిల్, ఇప్పుడు ఆ అవకాశం సంపాదించాడని వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై అనిల్ స్పందించినట్లుగా తెలుస్తోంది. తన సన్నిహితుల వద్ద బాలయ్యతో కచ్చితంగా సినిమా చేస్తాను కానీ ముందుగా ఎఫ్ 3 నే పట్టాలెక్కిస్తానని అన్నట్లు సమాచారం. బాలకృష్ణ అనిల్ రావిపూడి ఫెవరేట్ హీరో, సో కచ్చితంగా ఆ అవకాశాన్ని వదులుకోడు. కాకపోతే ఎఫ్ 3 పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు.


Advertisement

Recent Random Post:

Satyabhama Glimpse | Kajal Aggarwal | Sashi Kiran Tikka | Suman Chikkala | Sri Charan Pakala

Posted : April 18, 2024 at 11:02 pm IST by ManaTeluguMovies

Satyabhama Glimpse | Kajal Aggarwal | Sashi Kiran Tikka | Suman Chikkala | Sri Charan Pakala

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement