Advertisement

గాలి సంపత్: మొత్తం అనిల్ రావిపూడి డామినేషన్ అంటున్నారే!

Posted : December 16, 2020 at 7:26 pm IST by ManaTeluguMovies

చేసిన ఐదు సినిమాలతో అనిల్ రావిపూడి టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. తన లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో టాప్ దర్శకుల ప్లేస్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఎఫ్ 3 సినిమాను పట్టాలపైకి ఎక్కిస్తోన్న అనిల్ రావిపూడి ఒక చిన్న సినిమాను కూడా సపోర్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం గాలి సంపత్. అనిల్ రావిపూడి స్నేహితుడు ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండమే కాకుండా కథ కూడా అందిస్తున్నాడు. అనీష్ దర్శకుడు. అనిల్ రావిపూడి కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. గాలి సంపత్ కు స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడి అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడట. అనీష్ పేరును నామ్ కే వాస్తే అన్నట్లుగా అనిల్ వాడుతున్నాడని చెబుతున్నారు.

ప్రేమ కథ చిత్రం సినిమా విషయంలో మారుతి చేసిందే ఇప్పుడు అనిల్ చేస్తున్నాడని అంటున్నారు. సెట్స్ లో కూడా అనిల్ చాల యాక్టివ్ గా ఉంటున్నాడని, సెట్ డివిజన్ దగ్గరనుండి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడని తెలుస్తోంది. గాలి సంపత్ షూటింగ్ 80 శాతం చిత్ర యూనిట్ పూర్తయినట్లు ప్రకటించారు.


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special 2 Latest Promo – 25th & 26th September 2024 – Wed & Thur @9:30 PM – Hansika

Posted : September 24, 2024 at 12:52 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special 2 Latest Promo – 25th & 26th September 2024 – Wed & Thur @9:30 PM – Hansika

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad