ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నిశ్శబ్దం టీమ్ నుండి లోకల్ టివి ఛానల్ కు షాక్.. 1.1 కోట్ల రూపాయలు కట్టమని నోటీసులు

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమాకు నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

ఇదిలా ఉంటే నిశ్శబ్దం టీమ్ ఇప్పుడు ఒక లోకల్ టివి ఛానల్ కు నోటీసులు పంపింది. దాదాపు 1.1 కోట్ల రూపాయలు కట్టమని నోటీసులు పంపింది. నిశ్శబ్దం చిత్రాన్ని తమ ఛానల్ లో ప్రసారం చేస్తామని ఒక లోకల్ ఛానల్ ప్రచారం చేసింది. దీనికి స్పందించిన నిశ్శబ్దం యూనిట్ తమకు జరుగుతున్న నష్టానికి 1.1 కోట్ల రూపాయలను కట్టాలని నోటీసులు పంపింది.

హేమంత్ మధుకర్ ఈ న్యూస్ ను రీట్వీట్ కూడా చేయడంతో ఇది నిజమని భావించాలి. అయితే ఈ మధ్య ఓటిటిలో విడుదలవుతోన్న సినిమాలను ఇలా లోకల్ టివి ఛానల్స్ లో వేయడం నిజంగా దురదృష్టకరం. ఇటీవలే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా విషయంలో ఈటివి ఇలాగే సీరియస్ అయింది. కోటి రూపాయల నష్ట పరిహారం కట్టమని నోటీసులు పంపిన విషయం తెల్సిందే.

Exit mobile version