గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు సమర్పిస్తారు. మండలిలో ఈ కార్యక్రమాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పూర్తిచేయబోతున్నారు.
ప్రత్యేక పరిస్థితుల కారణంగా మధ్యాహ్నం 3 గంటల్లోపు ఇవాళ్టి సమావేశాల్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం అనుకున్న విధంగా సమావేశాలు కొనసాగుతాయనే నమ్మకం తక్కువగానే ఉంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు, జేసీ అరెస్టులు, ఎల్జీ పాలిమర్స్ లాంటి అంశాలపై ఆందోళనకు దిగాలని టీడీపీ నిర్ణయించింది. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆందోళన చేయాలని నిర్ణయించిన టీడీపీ.. దానిపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే నల్లచొక్కాలు వేసుకొని సమావేశాలకు హాజరైన టీడీపీ సభ్యులు.. ఆందోళన చేయడానికే మొగ్గుచూపుతున్నారు.