ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రూ.2.25లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్…హైలైట్స్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇసుక కొరత, కరోనా కట్టడి, లాక్ డౌన్ తోపాటు పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్ తో కొనసాగుతోన్న ఏపీలో ఓ వైపు కరోనా కట్టడి కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్న జగన్…..మరోవైపు సంక్షేమ పథకాల అమలులో రాజీ పడడం లేదు.

ఈ నేపథ్యంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ కు వార్షిక బడ్జెట్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. తాజాగా జరుగుతున్న 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైసీపీ సర్కార్ రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు.

శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమాల కాంబినేషన్ లో సుమారు రూ.2.25 లక్షల కోట్ట అంచనా వ్యయంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించారు.

‘అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నామన్న బుగ్గన….కరోనా విపత్తు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని సభకు తెలిపారు.

పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ది అసాధ్యమని అన్నారు.

బడ్జెట్ హైలైట్స్

రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు

సవరించిన అంచనాలు 2019-20

సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం

వివిధ పథకాలకు కేటాయింపులు

ప్రాథమిక, ఇంటర్‌ విద్యకు రూ.22,604 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
104, 108 లకు రూ.470.29 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు

Exit mobile version