ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శ్రావణి ఆత్మహత్య కేసు.. పరారీలో నిర్మాత అశోక్ రెడ్డి.. సెల్ ఫోన్ స్విచ్చాఫ్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాల్ డేటా ఆధారంగా పరారీలో ఉన్న అశోక్ రెడ్డి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ కేసులో ఏ2గా అశోక్ రెడ్డి ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయికృష్టలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ పరిచయం పెంచుకుని మోసం చేసినట్టు తెలుస్తోంది.

శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారంలో అశోక్ రెడ్డిదే కీలకపాత్రగా పోలీసులు తేల్చారు. ఈనెల 7న అమీర్ పేటలోని హోటల్ వద్ద దేవరాజ్, శ్రావణి, సాయికృష్ణకు గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అశోక్ రెడ్డి ఉన్నాడు. దీంతో వారిద్దరూ శ్రావణిని శారీరకంగా హింసించారు. దేవరాజ్ తో శ్రావణి సన్నిహితంగా ఉండడం అశోక్ రెడ్డికి నచ్చలేదు. దీంతో సాయికృష్ణతో పథకం రచించి దేవరాజ్ ను దూరం పెట్టేందుకు సహకరించినట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశారని స్నేహితుల వద్ద చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో టిక్ టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ కు దగ్గరైంది. శ్రావణికి వారిద్దరితో శారీరక సంబంధం గురించి తెలిసి ఆమెను దూరం పెట్టాలని చూశాడు. ఓదశలో దేవరాజ్ పై జూన్ 22న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. మరునాడు అరెస్టు చేయొద్దని.. తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపింది. ఈకేసులో అశోక్ రెడ్డి పేరు రాగానే సాయికృష్ణ ద్వరా దేవరాజ్ పేరు బయటపెట్టినట్టు తెలుస్తోంది.

Exit mobile version