ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నా రెండు చెంపలు పగలకొట్టాడు: అవినాష్

జబర్దస్త్ తో తగినంత గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు ముక్కు అవినాష్ గానే అందరికీ సుపరిచితం అవినాష్. ఈ ఏడాది బిగ్ బాస్ 4లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. తన రాకతో బిగ్ బాస్ కు భలే క్రేజ్ ను తీసుకొచ్చాడు.

అయితే బిగ్ బాస్ లోకి రావడానికి ముందు జబర్దస్త్ కు 10 లక్షల రూపాయలను కట్టానని చెప్పుకొచ్చాడు అవినాష్. ఈ విషయమే అందరికీ ఆశ్చర్యం కలిగించగా మరో సంచలన విషయాన్ని తెలియజేసాడు. తనను ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రెండు చెంపలువాయించేసాడట. ఆ పంచాయితీ దర్శకుడు పూరి జగన్నాథ్ వరకూ వెళ్ళిందిట.

లాక్ డౌన్ వల్ల దాదాపు మూడు నెలలు ఏ పనీ లేక ఇంట్లోనే ఉండిపోయాను. చేతులో ఉంచుకున్న డబ్బులన్నీ కరిగిపోయాయి. ఇంటి ఈఎంఐ అంటూ బోలెడు అప్పులు మీదపడ్డాయి. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. ఇదే విషయాన్ని గెటప్ శీను వద్ద చెబితే రెండు చెంపలు వాయించేసాడు. వెంటనే పూరి జగన్నాథ్ గారితో మాట్లాడించారు. ఆ మాటలు నాకు ఎంతో బూస్టప్ ను ఇచ్చాయి అని అన్నాడు.

Exit mobile version