మొదటి ఆఫర్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో నేను చాలా చోట్ల తిరష్కరణకు గురయ్యాను, చాలా చోట్ల అవమానాలు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ అంటూ పిలిచి చాలా అవమానకరంగా ప్రవర్తించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఎంతో మంది నేను నటుడిని అవుతానంటే విడ్డూరంగా చూశారు. ఒక చోటుకు నేను ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలో అక్కడున్న వారు నన్ను చాలా అవమానించారు. నీ మర్మాంగం చూపించి మగాడివి అని నిరూపించుకుంటేనే సినిమా ఛాన్స్ ఇస్తామని అన్నారు.
వారి ఆఫర్‌ను నేను తిరష్కరించాను. అలాంటి ఆఫర్‌ను నేను కోరుకోలేదు. ఆ సమయంలో నాకు సినిమాలపైనే కోపం వచ్చింది. కాని మళ్లీ సినిమాల కోసం ప్రయత్నించాను. 2012లో నాకు విక్కీ డోనర్ చిత్రంతో ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు ముందు నన్ను చాలా మంది కాస్టింగ్ మేనేజర్‌లు తిప్పుకున్నారు. కొందరు నన్ను అవమానించేలా ఆడిషన్స్‌కు పిలిచి మళ్లీ ఎప్పుడైనా రమ్మనేవారు. ఆడవారితో పాటు మగవారు కూడా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులకు గురయ్యారని ఇంకా అవుతూనే ఉన్నారని ఆయుష్మాన్ ఖారానా మాటల ద్వారా అర్థం అవుతుంది.