Advertisement

ప్రకాష్ రాజ్ మెగాస్టార్ పై బాబు మోహన్ సంచలన కామెంట్స్

Posted : May 27, 2022 at 2:42 pm IST by ManaTeluguMovies

కమెడియన్ గా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్. డా. రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘ఆహుతి’ సినిమాతో 1987లో నటుడిగా తెరంగేట్రం చేశారాయన. విలన్ గా విలన్ పాత్రధారులకు సహాయకుడిగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత టీడీపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు గులాబీ పార్టీలో చేరి ఆథోల్ ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినిమాలకు కొంత దూరంగా వుంటున్న ఆయన టీవీ సీరియల్స్ లో మాత్రం నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలని వెల్లడించారు. దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరూ లేరన్నారు. ఇండస్ట్రీ పెద్ద ఎవరన్నది పెద్దలు నిర్ణయిస్తారని చిరంజీవి ఇండస్ట్రీ బిడ్డగానే వుంటానన్నారని తెలిపారు.

బెంగళూరులో పుట్టిన వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ఏంటీ?.. చెన్పైలో తెలుగు వాళ్లను ఎన్నుకోరు. బెంగళూరులో తెలుగు సినిమాలని ఆడనీయరు. అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై దాసరి నారాయణరావు తరువాత ఇండస్ట్రీ పెద్దదిక్కు ఎవరనే అంశాలపై నటుడు బాబు మోహన్ ఆసక్తికరంగా స్పందించారు. దాసరి గారి తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరూ లేరు. సినీ పెద్దలు ఉన్నారు. అందులో కొందరు పైపైన పట్టించుకుంటున్నారు. కొందరైతే అస్సలు పట్టించుకోవడం లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కళామతల్లి సరైన సమయంలో పెద్ద దిక్కును ఎంచుకుంటుంది. ఆమెకు తెలుసు అంటూ వెల్లడించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘చిరంజీవిగారు ఇండస్ట్రీ బిడ్డగానే వుంటానని చెప్పడం అనేది ఆయన ఇష్టం. ఇండస్ట్రీలో పెద్ద దిక్కును ఇతర పెద్దలు నిర్ణయిస్తారని బాబూ మోహన్ ఓపెన్ గా చెప్పడం గమనార్హం. ఈ సమయంలో చిరునే ఇండస్ట్రీ పెద్ద అని ఆయన మాట మాత్రం కూడా వెల్లడించడానికి ఇష్టపడకపోవడం పలువురిని ఆలోచింపజేస్తోంది.

ఇక ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నకలపై కూడా బాబూ మోహన్ తనదైన శైలిలో స్పందిస్తూ ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కు చురకలింటించారు. స్థానికులు కాని వారు ఇక్కడకు రావడం.. ఎక్కడో బెంగళూరులో పుట్టిన వారు రావడం.. చెన్నైలో పుట్టిన వారు రావడం.. జరిగింది. చెన్నైలో తెలుగు వాళ్లని ఎన్నుకోమనండి చూద్దాం?

బెంగళూరులో తెలుగు సినిమాలనే ఆడనీయరు. అక్కడ పుట్టినోడు ఇక్కడ ‘మా’ ప్రెసిడెంట్ కావచ్చు. ఇది ఎంత వరకు కరెక్ట్. మా సభ్యులకు ఇదే చెప్పాం. అంతా తెలుసుకున్నారు. ఎవరిని గెలిపించాలో వారినే గెలిపించారు’ అంటూ చెప్పుకొచ్చారు. ‘మా’ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానెల్ లు పోటీపడగా అందులో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన విషయం తెలిసిందే.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 20th November 2024

Posted : November 20, 2024 at 10:33 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 20th November 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad