ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎమ్మెల్యే బాలకృష్ణ రాజీనామాస్త్రం.! చంద్రబాబు ఒప్పుకుంటారా.?

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి హంగామా సృష్టించారు.

బాలయ్య జనంలోకి వస్తే ఎలా వుంటుందో తెలుసు కదా.? ఈసారి ఎవరి దవడ అయినా పగిలి వుంటుందేమో.. అని చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారుగానీ, అలాంటి వ్యవహారమేదీ ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అంతా రాజీనామా చేస్తారనీ, తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననీ నందమూరి బాలకృష్ణ ప్రకటించేశారు.

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య సందడి.? అంటూ నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోయారు, కాస్త ఆనందంలోనూ మునిగిపోయారు. అన్నట్ట్, సిట్టింగ్ ఎంపీ స్పందించడంలేదనీ, ఆయన అసలు కనిపించడంలేదనీ బాలకృష్ణ సెటైర్లు వేసేశారండోయ్.

ఎంపీ మాత్రమే కాదు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కనిపించడంలేదంటూ హిందూపురంలో అడపా దడపా జనం నెత్తీ నోరూ బాదుకుంటుంటారు. జంతువులకి తమ ప్రజా ప్రతినిథుల ఫొటోల్ని తగిలించి నిరసనలు తెలుపుతుంటారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తుంటారు.

ఇంతకీ, ఎమ్మెల్యే బాలయ్య రాజీనామా చేస్తానంటున్నారు సరే.. ఆ రాజీనామాకి చంద్రబాబు ఒప్పుకుంటారా.? హిందూపురం కేంద్రంగా జిల్లా డిమాండ్ విషయమై బాలయ్య, తన పోరాటాన్ని కొనసాగిస్తారా.? ఒక్కరోజు షోతో సరిపెట్టేస్తారా.?

Exit mobile version