ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బాలయ్య – గోపీచంద్ చిత్రంపై ఫుల్ క్లారిటీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తన 107వ చిత్రంపై పెట్టాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే నిన్న ఈ చిత్రంలో బాలయ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సాల్ట్ ఎన్ పెప్పర్ లుక్ లో బాలయ్య అదిరిపోయాడు. ముఖ్యంగా ఆ బ్యాక్ గ్రౌండ్ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం కన్నడ చిత్రం మఫ్టీకు రీమేక్ అని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని ఈ చిత్ర లైన్ పట్ల ఇంప్రెస్ అయినట్లు ప్రచారం మొదలైంది. అయితే బాలయ్య సలహా మేరకు మఫ్టీ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారట నిర్మాతలు.

అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ రూమర్స్ పై స్పందించింది. ఈ చిత్ర కథ దేనికీ రీమేక్, ఫ్రీమేక్ కాదని, స్ట్రైట్ చిత్రం ఇది అని క్లారిటీ ఇచ్చారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version