ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కొరటాల-బాలయ్య కలిస్తే షేకింగే!

నటసింహ బాలకృష్ణ ఇటీవలే `అఖండ`తో మరోసక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. బొయపాటి-బాలయ్య ద్వయం తొలి హ్యాట్రిక్ ని నమోదు చేసింది. `సింహ`..`లెజెండ్` ని మించి కరోనా లాంటి కష్టకాలంలోనూ `అఖండ` బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇది పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. గోపీచంద్ లాంటి యాక్షన్ మేకర్ కి బాలయ్య లాంటి పవర్ ఫుల్ హీరో దొరికితే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా అనౌన్స్ మెంట్ నే సింహం బొమ్మతో వచ్చిందీ ద్వయం. ఇక బాలయ్య ఫస్ల్ లుక్ పోస్టర్..టీజర్..ట్రైలర్ ఇంకే స్థాయిలో ఊహకే వదిలేయాలి.

ఈ సినిమా బాలయ్య 107వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక 108వ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నారు. ఇప్పటికే స్ర్కిప్ట్ లాక్ అయింది. ఇది అనీల్ మార్క్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ఓ వైపు బాలయ్య ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండానే అనీల్ తనదైన మార్క్ వేయనున్నాడు. ఇంకా బాలయ్య తో సినిమాలు చేయడానికి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..వి.వి.వినాయక్ లాంటి వారు లైన్ లో ఉన్నారు.

అయితే ఇప్పుడీ వరుసలో నెన్సిబుల్ మేకర్ కొరటాల శివ కూడా చేరారు. బాలయ్య కోసం శివ అదిరిపోయే స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ బాలయ్యకి- కొరటాల సింకింగ్ ఎలా అన్నదే ఆలోచించాల్సిన అంశం. బాలయ్య మాస్ ఇమేజ్ ఉన్న హీరో. సుమోలు గాల్లోకి లేవాలి…గొడ్డలి చేతబట్టి తెగ నరకాలి.

శివ వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని స్ర్కిప్ట్ ని సిద్దం చేయాల్సి ఉంది. ఇలాంటి అంశాల్ని హైలైట్ చేస్తున్న సినిమాపై కొరటాల తనదైన మార్క్ సెన్సిబిలిటీ ట్యాగ్ ని వేయాల్సి ఉంది. అయితే ఇలాంటివన్ని కొరటాలకు కొట్టిన పిండి. `సింహ` కథ బాలయ్యని దృష్టిలో పెట్టుకునే కొరటాల సిద్దం చేసారని చాలా కాలం క్రితం వైరల్ అయింది.

అయితే ఆ కథను తస్కరించారని కొరటాల మేనమామ..నటుడు పోసాని కృష్ణ మురళి పబ్లిక్ గానే చెప్పారు. శివలో ప్రతిభను వాడుకుని వదిలేసారని..తన అమాయకత్వం కారణంగానే డైరెక్టర్ అవ్వడం ఆలస్యమైందని పోసాని ఓ సందర్భంలో అన్నారు. `సింహ` చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించి బాలయ్యకి ఓ ఇమేజ్ ని తీసుకొచ్చారు.

వరుస ప్లాప్ ల్లో ఉన్న బాలయ్యకి సింహ మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. అదే ఊపులో…అదే జానర్ లో లెజెండ్ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. `అఖండ` లో వేరియేషన్ ఛేంజ్ అయినా ద్విపాత్రాభినయం యాధాతధం. ఇప్పుడు బాలయ్య తో కొరటాల సినిమా తెరకెక్కిస్తే `సింహ`..`లెజెండ్`..`అఖండ` రికార్డులు అన్నింటిని తిరగరాసేలా ఉండాలి.

ఆ రేంజ్ లో కొరటాల స్ర్కిప్ట్ సిద్దం చేయాల్సి ఉంటుంది. బాలయ్యకి ఓ కొత్త ఐడెంటీటినీ ఇవ్వాలి. ఇప్పటివరకూ కొరటాలకు ఎదురులేదు. తీసిన సినిమాలన్ని బ్లాక్ బస్టరే. వందల కోట్లు వసూళ్లు తెచ్చినవే. ప్రస్తుతం కొరటాల `ఆచార్య` రిలీజ్ పనుల్లో బిజీ అయ్యారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు. అనంతరం కొరటాల -ఎన్టీఆర్ సినిమా షూట్ లో బిజీ అవుతున్నారు. ఆ తర్వాతే బాలయ్య ప్రాజక్ట్ గురించి కొరటాల ఆలోచించే అవకాశం ఉంటుంది.

Exit mobile version