Advertisement

జై బాలయ్య.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా!

Posted : May 26, 2022 at 12:55 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 150వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో కొన్ని పొలిటికల్ అంశాలు కూడా హైలెట్ కాబోతునట్లు సమాచారం. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని అభిమానుల్లో కూడా ఒక గట్టి నమ్మకం ఏర్పడింది.

బాలయ్య అఖండ సినిమాతో సక్సెస్ అందుకోవడం అలాగే మరొకవైపు దర్శకుడు క్రాక్ సినిమాతో ఫామ్ లోకి రావడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అయింది అని ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా అదిరిపోయే విధంగా చేయాలని నిర్మాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.

మొదట అన్నగారు అనే టైటిల్ అనుకున్నట్లుగా టాక్ అయితే వచ్చింది. కానీ బాలయ్యతో మరో సినిమా చేయనున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఆ టైటిల్ తన కథకు సరిపోతుంది అని మళ్ళీ బాలకృష్ణ తో మాట్లాడినట్లు సమాచారం.

అయితే ఈ తరుణంలో గోపీచంద్ మలినేని అందరికీ నచ్చే విధంగా ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా బాలకృష్ణ నుంచి ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులలో జై బాలయ్య అనే స్లోగన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక జై బాలయ్య అనే టైటిల్ సినిమాకు పెడితే మామూలుగా ఉండదు అని థియేటర్స్ ఇన్ దద్దరిల్లిపోవడం పక్క అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ లీడర్ గానే కాకుండా ఒక వర్గానికి పెద్ద మనిషిగా కూడా కనిపిస్తాడు అని సమాచారం. ఈ సినిమాలో ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని కొన్ని జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నాడట. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Posted : March 27, 2024 at 11:40 am IST by ManaTeluguMovies

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్‌చరణ్‌

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement