‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఇవాళ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం ట్యాక్సులు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు ‘మా’ బిల్డింగ్ కట్టలేదు. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా అనే ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? అందుకే నేను ఇలాంటి విషయాల్లో ఏం కలుగజేసుకోను. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి’’ అంటూ బాలయ్య కౌంటర్లు వేశాడు