కానీ తాజాగా బాలకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూన్ 9న ఏపీ సీఎం జగన్ తో జరిగే మీటింగ్ కి పిలుపు వచ్చిందా అంటే.. ‘ లేదండి. నాకు తెలిసింది, అది ఎవరి ద్వారానో, కానీ మెయిన్ సోర్స్ నుంచి నాకు పిలుపు రాలేదని’ చెప్పి మరోసారి ఆయన వ్యాఖ్యలతో దుమారం లేపారు.
అందరితో స్నేహభావంగా ఉండే మీకు ఇండస్ట్రీతో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడగగా, బాలకృష్ణ సమాధానం ఇస్తూ.. ‘ఇండస్ట్రీ కోసమే.. మొదటగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెండవది సినిమా ఇండస్ట్రీ బాగుకోసమైతే 100% నన్ను పిలవకపోయినా ఎప్పుడూ ముందుటాను. ఈ కరోనా ఇంకా ఎంత కాలం ఉన్నా నా వంతుగా ఇండస్ట్రీని నేను ఆదుకుంటాను. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో ఆదుకున్నా, ఇప్పుడూ నా పరంగా ఆదుకుంటానని’ అన్నారు..
ఒక్క మాటతో(భూములు పంచుకుంటున్నారా? అనే మాట) సెన్సేషన్ క్రియేట్ చేశారు.. ఆ విషయం సర్దుమణిగిందా అంటే, ‘ లేదండి, ఇంకా సర్దుమణిగినట్టు కన్పించడం లేదు. ఒక మాట చెప్తా.. ప్రస్తుతం కరోనా వల్ల ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది.. ముందుగా పరిష్కరించాల్సింది.. షూటింగ్స్ ఎలా చేయాలి? థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ కావాలి? కార్మికులకు ఎలా మళ్ళీ జీవనం కలిగించాలి అన్నవి ప్రధానం కానీ ఇవి వదిలేసి.. ఇప్పుడు ఏపీకి వెళ్లి సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మీటింగులేంటో నాకు అర్థంకావట్లేదు. ఇప్పుడు స్టూడియోస్ కట్టాలన్నా పనోళ్ళు రాలేని పరిస్థితి. ఇండస్ట్రీ బాగు కోసం కాకుండా వాళ్ళ ‘సెల్ఫ్ సెంటర్డ్’ అనీ వారి స్వలాభాల కోసం చేస్తున్నారంతే’ అని బాలయ్య అన్నారు.
మరి సమస్య వచ్చినప్పుడు రియల్ ఇండస్ట్రీ గురించి కష్టపడేదెవరు అని అడిగితే ‘ ఇలా చూసుకుంటే ఎవరూ కష్టపడట్లేదు. ఉదాహరణకి జరిగిన విషయం మీద తలసాని యాదవ్ గారు నాతో మాట్లాడతా అన్నారు. కాల్ రాలేదు. విజయవాడ పిలుపుకి ఎవరో కాల్ చేస్తారు అన్నారు.. అదీ రాలేదు.. ఎలా భరితెగించారంటే యధా రాజా తద ప్రజా అన్నట్టు.. ప్రజల్ని అంత చులకనగా చూస్తున్నారు. అదే నా భాధ.. అటు రాజకీయం అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఒక విప్లవం రావాలి.. విప్లవం అంటే ఈ సో కాల్డ్ పెద్దలు కాదండి, 24 క్రాఫ్ట్స్ లోని అందరి నుంచీ విప్లవం రావాలి. అలాగే, సమాజం నుంచి ప్రభుత్వంపై విప్లవం రావాలి.. అప్పుడే రాష్టం, చలనచిత్ర పరిశ్రమ రెండూ బాగుంటాయి. రాజకీయ పార్టీ పరంగా ఇదంతా జరగట్లేదు, కావాలనే చేస్తున్నారని’ బాలకృష్ణ అన్నారు.
ఇక ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై మీ కామెంట్ అని అడిగితే ‘ఈ కరోనా టైంలో అన్నిటిమీద స్పందించలేను కానీ అన్న కాంటీన్ లాంటివి ఉండి ఉంటే ఈ సమయంలో చాలా హెల్ప్ అయ్యేవి. అలాగే అన్నీ ఓకే అనుకొని వారూ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు, డిస్కషన్స్ అయ్యాక ఇప్పుడు రాజధాని మార్చడమే విడ్డూరంగా, చాలా హాస్యాస్పదంగా ఉందని’ అన్నారు.