ఇదిలా ఉంటే, స్వయంగా బాలకృష్ణ మరో రెండు బిగ్ సర్ప్రైస్ లను రెడీ చేశారు. ఆ విషయంలోకి వెళితే 2004 లో సొంత నిర్మాణంలో, దర్శకుడిగా బాలయ్య ప్రారంభించిన సినిమా ‘నర్తనశాల’. సౌందర్య అకాల మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. సౌందర్య పాత్రకి సరైన రీప్లేస్ మెంట్ దొరకకపోవడం వలనే ఆ సినిమా పూర్తి చేయలేకపోయానని బాలయ్య చాలా సందర్భాల్లో తెలిపారు కూడాను. ఆయన 60వ బర్త్ డే సందర్భంగా ఈ ‘నర్తనశాల’కి సంబందించిన 17 నిమిషాల కంటెంట్ ని ఆన్ లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే అయన ఈ సినిమా కోసం పాడిన ఓ పాటని కూడా రిలీజ్ చేయనున్నారట. ఇలా మూడు వేరు వేరు గిఫ్ట్ లతో అభిమానులను బాలయ్య సర్ప్రైజ్ చేయనున్నారు.
మరోవైపు ఇండస్ట్రీ మంచి కోసం ఎప్పుడూ ముందుంటాను.. కానీ స్వార్ధ పూరిత రాజకీయాలు చేస్తే మాత్రం కుండా బద్దలుకొట్టి మాట్లాడతానని ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ పై బాలకృష్ణ కామెంట్స్ రోజూకూ న్యూస్ లో చర్చలకు దారి తీస్తున్నాయి.