ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నర్తనశాల బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల క్రితం నర్తనశాల అనే చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. తాను అర్జునుడి పాత్రలో, శరత్ బాబు ధర్మరాజుగా, శ్రీహరి భీముడిగా, సౌందర్య ద్రౌపది పాత్రలో, నర్తనశాల షూటింగ్ ను మొదలుపెట్టాడు బాలకృష్ణ. తానే స్వీయ దర్శకత్వం వహించాడు కూడా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది.

అయితే ఇన్నేళ్ల తర్వాత నర్తనశాల ఫుటేజ్ ను మన ముందుకు తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు బాలయ్య. నర్తనశాలకు సంబంధించిన 17 నిమిషాల నిడివున్న సన్నివేశాలను ఎన్ బి కె థియేటర్ లో, శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు బాలయ్య. దీని ద్వారా వచ్చిన అమౌంట్ లో కొంత భాగాన్ని చారిటీ కోసం ఖర్చు పెట్టనున్నట్లు తెలిపాడు. ఈ నెల 24న ఈ వీడియో విడుదల కానుండగా నేడు ఈ చిత్రంలో అర్జునుడిగా బాలయ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

అర్జునుడిగా బాలయ్య లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమా కార్యరూపం దాలిస్తే ఎలా ఉండేదో కానీ మొత్తానికి అందులోని ఫుటేజ్ ద్వారా సౌందర్య, శ్రీహరిలను మళ్ళీ చూడగలగడం ఆనందదాయకం.

Exit mobile version