గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను పరిశీలించారు. రైతులను ఆదుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీతోపాటు దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం దేవత అయితే.. వైసీపీ రాక్షసులని బాలకృష్ణ అన్నారు. రైతులను రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం రైతులను ఆదుకుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానికులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.