కొత్త ఏడాదిలో అయినా ప్రారంభం అవుతుందని ఆశించిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది. జనవరి పూర్తి కాబోతున్నా ఇప్పటి వరకు షూటింగ్ అప్ డేట్ ఇవ్వలేదు. సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఆ చిత్ర నిర్మాత మిర్యాల రాజేందర్ చెప్పారు. సినిమా ఆ సమయం వరకు విడుదల అవ్వాలంటే షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టాలి. కాని బాలయ్య బోయపాటి మూవీ ఇంకా పట్టాలెక్కక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు ఏమైనా తలెత్తాయా అంటూ కూడా కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను కొట్టి పారేసి యూనిట్ సభ్యులు ఎప్పుడెప్పుడు షూటింగ్ పునః ప్రారంభిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.