బాలకృష్ణ, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కోట్లు విలువ చేసే ఈ ప్రాపర్టీని ఫిబ్రవరి 11న బాలకృష్ణ కొనుగోలు చేసాడు. నడింపల్లి సత్యశ్రావణి అనే వ్యక్తి నుండి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 9395 చదరపు అడుగులలో ఈ భవంతిని నిర్మించారట. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిని బాలకృష్ణ, వసుంధరా దేవి కంబైన్డ్ ప్రాపర్టీగా రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.