ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్‌ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్‌అమ్మేశారని ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.