ఇదిలా ఉంటే అఖండ టీజర్ కు ఇటీవలే భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. విడుదలైన కొన్ని వారాలకే 50 మిలియన్ వ్యూస్ ను అందుకుంది ఈ టీజర్. ఇక బాలయ్య ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడట. నిర్మాతకు వీలు కల్పించడం కోసం కేవలం 7 కోట్ల రెమ్యునరేషన్ ను మాత్రమే తీసుకున్నాడట. తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాడట.
బోయపాటి కూడా సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ ను తీసుకోలేదు. దీనివల్ల నిర్మాతకు ఈ బడ్జెట్ ను సినిమా మేకింగ్ కోసం ఖర్చుపెట్టడానికి వీలవుతుంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.