ఈ టైములో పలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్ గా షూట్ మొదలు పెట్టి ఒక షెడ్యూల్ చేశారు. అంతే లాక్ డౌన్ వచ్చేసి షూటింగ్స్ కి చెక్ పెట్టేసింది. ఇది పక్కనపెడితే ఈ చిత్ర టీం షూటింగ్ అయితే స్టార్ చేసింది కానీ కొన్ని విషయాలు ఇప్పటికీ ఫైనలైజ్ చేయలేక ఇబ్బందులు పడుతోంది. అవే బాలయ్య సరసన కనిపించబోయే హీరోయిన్స్ అండ్ బాలయ్యతో ఢీ కొట్టే విలన్స్.
ఇటీవల అంజలిని ఒక హీరోయిన్ గా ఫైనల్ చేసాం, మరో హీరోయిన్ కోసం చూస్తున్నామని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదని డైరెక్టర్ బోయపాటి శ్రీనుని స్వయంగా చెప్పాడు. అలాగే మెయిన్ విలన్స్ ఇద్దరు ఉంటారు. అందులో ఒకరిగా శ్రీకాంత్ ని ఫైనల్ చేయగా.. రెండవ విలన్ కోసం ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. లాక్ డౌన్ చివరి దశకు వస్తోంది, జూన్ లేదా జులై నుంచి షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ టైంకి అయినా బోయపాటి ఇవన్నీ ఫైనల్ చేసి చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తాడేమో చూడాలి. బాలయ్య మునుపెన్నడూ చేయని ఓ అఘోరా పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి మిర్యాల రవీందర్ డైరెక్టర్.