ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బాలయ్య సినిమాలో హనీ..!

వెంకటేష్‌ మరియు వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్‌ 2 లో మెహ్రీన్ హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈమె ‘ఎఫ్ 3’ లో కూడా నటిస్తుంది. ఇక పెళ్లికి సిద్దం అయిన ఈ ముద్దుగుమ్మ మరో ఆఫర్‌ ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో ఈమె హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. కనుక బాలయ్య కు జోడీగా నటించేందుకు వచ్చిన ఆఫర్‌ తో ఫుల్‌ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ తో సినిమా అంటే స్టార్‌ హీరోయిన్స్ మొహం చాటేస్తున్నారు. బాలయ్యతో శృతి హాసన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేసిన గోపీచంద్‌ మలినేనికి తిరష్కరణ ఎదురయ్యింది. దాంతో బాలయ్య కోసం మెహ్రీన్ ను సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళ స్టార్‌ నటి వరలక్ష్మి కీలక పాత్రలో ఈ సినిమా లో కనిపించబోతున్నట్లగా చెబుతున్నారు. బాలయ్యకు జోడీగా మెహ్రీన్‌ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Exit mobile version