ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బాలయ్య కొత్త సినిమా బిగ్ న్యూస్‌


నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది. షూటింగ్ రెండు వారాలు బ్యాలన్స్ మినహా మొత్తం పూర్తి అయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా ముగించేశారు. సినిమా ను పూర్తి చేసి పరిస్థితులు కుదుట పడ్డ వెంటనే విడుదల చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సమయంలోనే బాలయ్య తదుపరి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా చకచక జరిగి పోతుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.

నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్‌ కథను సిద్దం చేయడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ నెలలో సినిమా పట్టాలెక్కి వెంటనే రెగ్యులర్‌ షూట్‌ కు వెళ్లి ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని పరిస్థితులు అందుకు సహకరించలేదు. దాంతో జులై నెలలో సినిమా పూజా కార్యక్రమాలు చేయబోతున్నట్లుగా దర్శకుడు గోపీచంద్‌ ప్రకటించాడు. ఈ సినిమా కోసం బాలయ్య ప్రత్యేక గెటప్ ను ట్రై చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. జులై లో సినిమా ప్రారంభం అయితే వచ్చే ఏడాది ఆరంభంకు విడుదల అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version