‘పార్టీ ప్లీనరీ పేరు చెప్పి బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. రైతుల ఆదాయం పెంచేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించమంటే విమర్శలు చేస్తున్నారు. దేశానికి మజ్లిస్ క్యాన్సర్ లా మారితే.. ఆ పార్టీనే పక్కన పెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ 27 మంది బీసీలకు పదవులు ఇస్తే.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. కేసీఆర్ ఆటలు ఇక సాగవు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే’ అని అన్నారు.