అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాను జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. మొత్తం నిర్మాణ వ్యయం సదరు నిర్మాణ సంస్థ ఖర్చు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా కోసం అన్న పూర్ణ స్టూడియోలో వేసిన సెట్టింగ్ మొదలుకుని అన్ని విషయాల్లో కూడా భారీ తనం కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు నాగార్జున కాని నాగ చైతన్య కాని ఈ స్థాయి బడ్జెట్ సినిమాల్లో నటించడం జరగలేదు. కాస్త అటు ఇటుగా ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లకు పైగా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అక్కినేని హీరోలు ఇద్దరు ఉన్నారు.. అలాగే ఒక సూపర్ హిట్ మూవీకి ఇది సీక్వెల్ కనుక ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధ్యం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో కేవలం వసూళ్ల రూపేనా కాకుండా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ కూడా పదుల కోట్లకు అమ్ముడు పోతున్నాయి. కనుక బంగార్రాజుకు 50 కోట్లు పెడితే నష్టం ఉండక పోవచ్చు అంటున్నారు.
నాగార్జున మరియు నాగ చైతన్యలు ఈ సినిమా లో తాత మనవడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగ చైతన్య యంగ్ బంగార్రాజుగా కనిపించబోతుండగా.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపించబోతుంది. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్క యూత్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాని సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటం వల్ల నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి రెండు వారాల్లో బంగార్రాజు సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.