Advertisement

నాగార్జున సినిమాలో మాజీ స్టార్‌ హీరోయిన్‌ నెగటివ్ రోల్‌

Posted : March 13, 2021 at 12:02 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్‌ హీరోలందరితో హీరోయిన్‌ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భూమిక చావ్లా ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది. అలాంటి భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈమె మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసేందుకు సిద్దం అయ్యింది. నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న బంగార్రాజు సినిమాలో నెగటివ్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా లో భూమిక కూడా కనిపించబోతుందని అది కూడా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమా తదుపరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో అయినా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొన్నటి వరకు చైతూ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని చైతూ పాత్రను తొలగించినట్లుగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

Ranarangam : కృష్ణతీరంలో గుంటూరు కారం

Posted : April 17, 2024 at 11:48 am IST by ManaTeluguMovies

Ranarangam : కృష్ణతీరంలో గుంటూరు కారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement