ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 38 – బిగ్‌బాస్‌తో అమితుమి ఢీల్‌లో హారిక జుట్టు కట్‌

బిగ్‌ బాస్‌ ఆరవ వారం కెప్టెన్సీ టాస్క్‌ నిన్నటి ఎపిసోడ్‌ లో ప్రారంభం అయ్యింది. ఈ వారం కాస్త విభిన్నంగా ఉండేలా బిగ్‌ బాస్‌ టీం టాస్క్‌ ను అమితుమీ ఛాలెంజ్‌ పేరుతో ఇచ్చాడు. ఇంటి సభ్యులు అరియానా మరియు అఖిల్‌ టీం లుగా విడిపోయారు. రెండు టీమ్‌ లు కూడా 250 కాయిన్స్‌ ను కలిగి ఉన్నాయి. ఆ కాయిన్స్‌ ను బిగ్‌ బాస్‌ ఇచ్చే డీల్‌ చేసి తగ్గించుకోవాల్సి ఉంటుంది. బిగ్‌ బాస్‌ ఇచ్చే టాస్క్‌ లను చేస్తే ఆ కాయిన్స్‌ తగ్గుతూ వస్తుంటాయి. రెండు టీమ్‌ లు కూడా తమ వద్ద ఉన్న కాయిన్స్‌ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందులో భాగంగా ఢీల్‌ చేసేందుకు సిద్దం అవ్వాలి. మొదటగా అఖిల్‌ టీం నుండి ఒక మగ ఇంటి సభ్యుడు ఒంటిమీద బట్టలు అన్ని కూడా కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కుమార్‌ సాయి చేశాడు.

ఆ తర్వాత ఛాలెంజ్ లో భాగంగా ఒంటిపై బట్టలు మినహా మిగిలిన బట్టలు మరియు వస్తువులు అన్ని కూడా వెనక్కు ఇచ్చేయాలి. ఈ డీల్‌ ను అరియానా టీం నుండి అభిజిత్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. తన డ్రస్‌ లు మరియు వస్తువులు అన్నింటిని స్టోర్‌ రూం ద్వారా ఇచ్చేశాడు. మూడవ డీల్‌ లో భాగంగా ఒక అమ్మాయి జుట్టును మెడపై వరకు కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీల్‌ కోసం అఖిల్‌ బెల్‌ కొట్టాడు. అఖిల్‌ టీం నుండి హారిక జుట్టు కట్‌ చేసుకునేందుకు సిద్దం అయ్యింది. అన్నయ్య జుట్టు కట్‌ చేసుకోవద్దంటూ ముందుగానే హెచ్చరించాడు. కాని తప్పదు అంటూ కట్ చేయించుకుని రెడ్‌ కలర్‌ వేయించుకుంది.

డీల్‌ 4 లో భాగంగా ఒక మీటను ఇంటి సభ్యుడు ఎవరైనా ఒక్క చేతితో పట్టుకుని ఉండాలి. ఈ ఢీల్‌ ను కూడా చేసేందుకు అఖిల్‌ గంట కొట్టాడు. వారి టీం నుండి కుమార్‌ సాయి దీనికి చేశాడు. చేయి నొప్పిగా ఉన్నా కూడా అతడు అలాగే ఉంచాడు. గట్టిగా మొత్తుకుంటూ ఢీల్‌ ను పూర్తి చేశాడు. ఆ తర్వాత డీల్‌ లో భాగంగా కోడిగుడ్లు, పాలు, జ్యూస్‌ ఇలా అన్నింటిని మిక్స్‌ చేసి తాగాల్సి ఉంటుంది. ఆరియానా ఈ సారి ఢీల్‌ చేసుకుంది. ఆమె టీం నుండి లాస్య దీనిని చేసింది. ఒక ఇంటి సభ్యుడు జ్యూట్‌ తో అల్లిన డ్రస్‌ ను ధరించాల్సి ఉంటుంది. అందుకు అరియానా టీమ్‌ రెడీ అయ్యింది. ఆమె టీం నుండి మోనాల్‌ ఆ టాస్క్‌ కు రెడీ అయ్యింది. ఇలా మొత్తంగా బిగ్‌ బాస్‌ తో డీల్స్‌ ను కుదుర్చుకుని ఇంటి సభ్యులు ఆట ఆడేశారు.

Exit mobile version