బిగ్ బాస్ అంటే అనేక రకాలుగా ఆదాయం వస్తుంది. హౌస్ లో బ్రాండింగ్.. టాస్క్ ల్లో ప్రత్యేకంగా బ్రాండింగ్ తో పాటు సినిమాల ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో లేదా స్టేజ్ పై సందడి చేయడం జరుగుతుంది. కాని ఈ సారి సినిమాల ప్రమోషన్ కు నో ఛాన్స్. హౌస్ లోకి ఎవ్వరిని కూడా వెళ్లకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుగా రెండు వారాలు క్వారెంటైన్ లో ఉండి ఆ తర్వాత హౌస్ లో అడుగు పెట్టారు. కనుక మరెవ్వరితో కూడా కలవనివ్వడం లేదు. ఆ కారణం వల్లే బిగ్ బాస్ లో సినిమాల ప్రమోషన్ లు లేవు.
దానికి తోడు థియేటర్లు మూతపడి ఉన్న కారణంగా పెద్ద సినిమాలు ఏమీ కూడా విడుదల అవ్వడం లేదు. ఓటీటీ లో విడుదల అవుతున్నా కూడా వాటికి పెద్దగా ప్రమోషన్ చేయాలని భావించడం లేదు. నిశబ్దం సినిమా విడుదల సమయంలో అనుష్క స్టేజ్ పై కనిపించబోతుందని భావించారు. కాని నాగార్జున ఆరోగ్యం దృష్ట్యా కూడా ఎవరితో కలవనివ్వడం లేదు అంటూ సమాచారం అందుతోంది. సినిమాల ప్రమోషన్ ద్వారా గత మూడు సీజన్ లలో భారీ మొత్తమే నిర్వాహకులకు వచ్చింది. కాని ఈసారి మాత్రం ఆ ఆదాయకుం గండి పడ్డట్లయ్యింది